చాణక్య రివ్యు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

హిట్స్ ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా బిన్నమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ తన లాంగ్ కెరీర్ ని కంటిన్యు చేస్తున్నాడు హీరో గోపీచంద్. కథ ఎంపికలో కొత్తదనం, డెబ్యు డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడం గోపి స్టయిల్. సాహ‌సం లాంటి సినిమాతోనే తానెంత ప్ర‌త్యేక‌మో గోపిచంద్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చెప్పారు. ఈ క్ర‌మంలోనే త‌మిళంలో మంచి గుర్తింపు పొందిన తిరు ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య అనే స్పై థ్రిల్లర్ లో నటించాడు గోపి చాంద్. . టిజర్స్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చాణక్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు రాష్టాల్లో సైరా ఫీవర్ కొనసాగుతున్న వేలా ఈ సినిమాపై ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంది, మెగా స్టార్ ని తట్టుకుని చాణక్య స్టాండ్ అవుట్ అవ్వగలదా లేదా ఈ రివ్యూలో చూసేద్దాం.

కథ కథనం విశ్లేషణ…!

ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్ అయినా హీరో గోపీచంద్ ఒక మిషన్ నిమిత్తం ఒక బ్యాంక్ ఉద్యోగిగా మారాల్సి వస్తుంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌కు చెందిన పెద్ద‌ టెర్రరిస్ట్ ఖురేషిని టార్గెట్ చేసి కొంతమంది స్లీపర్ సెల్స్ ను హ‌త‌మారుస్తాడు. దానితో ఖురేషి కూడా గోపిని టార్గెట్ చేస్తాడు . ఇలా ఖురేషీని గోపిచంద్‌ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు వ‌చ్చాయి..? అస‌లు ఆయ‌న‌ చేపట్టిన మిషన్ ఏమిటి అన్నదే చాణక్య అసలు కథాంశం. వినడానికి రొటీన్ కథలాకే అనిపించినా.., సినిమా బ్యాక్ డ్రాప్ పాకిస్తాన్ గడ్డ కావడంతో కొంత కొత్తదనంగానే అనిపిస్తుంది. హీరో విలన్ లా మధ్య వచ్చే మాస్ సన్నివేశాలు, మైండ్ గేమ్ ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లే రెండు ఒకదానిలో ఒకటి మౌల్ద్ అవ్వలేదేమో అనిపిస్తుంది. దీనితో మొద‌టి భాగం కాస్త నెమ్మ‌దిగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక రెండో భాగం మాత్రం స్పీడ్ అందుకుని ప్రేక్షకులకి కొంచం రిలాక్సేషన్ ఇస్తుంది. ప్ర‌ధానంగా ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తాయి. క‌థాను సారంగా వ‌చ్చే ట్విస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇక గోపిచంద్‌, మెహ్రీన్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్ చేసిన ప్ర‌త్యేక గీతం కూడా సినిమాకు మరో అద‌న‌పు బ‌లంగా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో హీరో గోపిచంద్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ఆయ‌న న‌ట‌నే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. గోపీచంద్ మెహ్రీన్ మ‌ధ్య కెమెస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. అయితే.. తమిళంలో మంచి గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు తిరు టాలీవుడ్‌లో మాత్రం మొద‌టి సినిమాతోనే కొంత త‌డ‌బ‌డిన‌ట్టు అనిపిస్తుంది. కొత్త తరహ యాక్షన్ సన్నివేశాలు తీసే అవకాశమున్న పరమ రొటీన్ పద్దతులోన కొనసాగింది ఈయన టేకింగ్. క్లైమాక్స్‌కు ముందే పెద్ద ఛేజింగ్ సీన్ పెట్టి.. ప్రేక్ష‌కుడిని క్లైమాక్స్ మూడ్‌లోకి తీసుకు వెళ్లాక కూడా గోపీ – మెహ్రీన్ మ‌ధ్య డ్యూయ‌ట్ సాంగ్ రావ‌డం చూస్తుంటే కమర్షియల్ ఫార్ముల ప్రకారం పాట పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక టెక్నిక‌ల్‌గా చూస్తే ఇక‌ వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ సూప‌ర్బ్ అని చెప్పొచ్చు. విశాల్ అందించిన పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. అలాగే శ్రీచరణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనానికి త‌గ్గ‌ట్టుగా ఉంది. మొత్తంగా హీరో గోపిచంద్ మ‌రో విభిన్న క‌థాంశంతో కొంత‌ వ‌ర‌కు స‌క్సెస్ అయినా చాలా రోజుల నుంచి గోపీచంద్ కోరుకున్న స్థాయి సినియా అయితే చాణ‌క్య కాదు. ద‌ర్శ‌కుడు తిరు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే.. సినిమా మ‌రింత ఇంట్రెస్టింగ్ ఉండేద‌ని చెప్పొచ్చు. ప్రస్తుతం థియేటర్లలో సైరా గాలి వీస్తున్న సమయంలో దాన్ని తట్టుకుని నిలబడటం కష్టమనే చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకు మహా రేటింగ్ : 2.5/5

Share.

Comments are closed.

%d bloggers like this: