‘ ఆర్ ఆర్ ఆర్ ‘ టైటిల్ లీక్..! అబిమానులకు షాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలీదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా టైటిల్ నుండి టీజర్స్ ట్రైలర్స్ వరకు అన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ప్రేక్షకుల్లో కావల్సినంత హైప్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు సరిగ్గా ఆర్ ఆర్ ఆర్ కి అదే పంథాను రాజమౌళి అనుసరిస్తూ సరికొత్త టైటిల్ని ఎంచుకున్నాడు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ టైటిల్ ని ఎంపిక చేస్తే అది ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. కాని ఈ టైటిల్ చూడగానే.. ఏంటి ఇంత సింపుల్ గానా..? అంటూ పెదవి విరిచేశారంతా…!  రామ రౌద్ర రుషితం `అంటూ టైటిల్ లోగోని రిలీజ్ చేయడంతో.. అసలు ఇదేనా ఒరిజినల్ ? అంటూ అందరికీ సందేహం కలిగింది. ఎందుకంటే ఆ టైటిల్ లో అసలు ఏమాత్రం జనాలు మెచ్చే ఎలిమెంట్ లేనే లేదు. పైగా గ్రాంధిక భాషలో టైటిల్ కనిపించడం పెద్ద షాక్ నే ఇచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి సైతం `సైరా` అంటూ రెండక్షరాల్లో టైటిల్ అద్భుతంగా కుదిరింది. అలాంటిది రాజమౌళి టైటిల్ ఎందుకిలా ఉంటుంది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేశారు. కూల్ గా ఆలోచిస్తే అది జక్కన్న టీమ్ పంపించిన అధికారిక టైటిల్ కానే కాదని అర్థమైంది. అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే. టైటిల్ ఇదే ఫైనల్ కాదని తెలిసింది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్టివిటీ ఉండే టైటిల్ ఆర్.ఆర్.ఆర్ కు కుదరాలి. పైగా ఫ్యాన్ మేడ్ టైటిల్ కంటే ఆర్.ఆర్.ఆర్ అన్న టైటిలే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: