దర్శకధీరుడు.. బాహుబలి.. రాజమౌళి..! బర్త్ డే స్పెషల్ స్టోరీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు… తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న…! మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి…! పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి హీరో ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు…..! స్టోరీ ఎలాంటిదైనా తన ట్యాలెంట్ తో మెస్మరైజ్ చేసే గ్రేట్ టెక్నీషియన్. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి….! హీరోలతో సమానమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రేజీ డైరెక్టర్. ఆయనే దర్శకమౌళి…రాజమౌళి. నేడు ఈ సూపర్ సక్సెస్ డైరెక్టర్ పుట్టిన రోజు..,

ఎస్. ఎస్. రాజమౌళి… ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ఇది పరిచయం అక్కర్లేని పేరు. 2001లో స్టూడెంట్ నెం.1 సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి, అపజయం అంటూ ఎరుగని దర్శకుడిగా సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న ఆయన ‘బాహుబలి’ ప్రాజెక్టుతో దేశం గర్వించదగ్గ ఫిల్మ్ మేకర‌గా పేరు తెచ్చుకుని ఇప్పుడు ఎన్టీఆర్ రాంచరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ అనే మరో ప్రతిష్టాత్మక శిల్పాన్ని చెక్కే పనిలో నిమగ్నమై ఉన్నారు. నేడు అక్టోబర్ 10న.., 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాజమౌళి ప్రముఖ సినీ కథారచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కొడుకు. ఈయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాజమౌళి పుట్టింది కర్నాటకలోని రాయ్ చూర్ లో. ఆయన హోమ్ టౌన్ పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు వద్ద శిష్యురికం మొదలు పెట్టిన రాజమౌళి ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగారు.

జునియర్ ఎన్టీఆర్ హీరోగా కే రాగవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి తీసిన స్టూడెంట్ నెం.1 అటు తారక్ కెరీర్ లోను… ఇటు రాజమౌళి కెరీర్ లోను చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే రాజమౌళి, ఎన్టీఆర్ తమ కెరీర్ లో తొలి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహాద్రి’ ఒక సంచలనమే సృష్టించింది. వేరే దర్శకుడు మొదలుపెట్టి కొంత షూటింగ్ తరువాత ఆగిపోయిన సింహాద్రి సినిమాను రాజమౌళి తన భుజాలకెత్తుకుని, తనదైన ప్రతిభా సామర్థ్యాలతో విజయవంతం చేశాడు. సింహాద్రి తర్వాత రాజమౌళి నితిన్ హీరోగా ‘సై’ సినిమాను తెరకెక్కించాడు. అప్పటి వరకు తెలుగు ఆడియన్స్ కు అంతగా పరిచయం లేని రగ్బీ ఆటను…. ఈ సినిమాలో చూపించి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. హాట్రిక్ సక్సెస్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ‘ఛత్రపతి’ సక్సెస్ తో ప్రభాస్ కెరీర్ మరోమేట్టు ఎక్కింది. ఈ క్రెడిట్ దర్శకుడిగా రాజమౌళికే దక్కుతుంది. రాజమౌళి రూపొందించిన ఐదవ చిత్రం ‘విక్రమార్కుడు’. రవితేజ, అనుష్క జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద జింతాతా అనిపించి…నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తెలుగు తెరపై యముడి ఫార్ములా పై తీసిన సినిమాలు…. బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టినట్టే ఈ సినిమా అప్పటి వరకు చాలా లావుగా రొటీన్ గా కనిపించే ఎన్టీఆర్‌ను ఈ సినిమాతో సన్నబడేలా చేసి సక్సెస్ సాధించాడు రాజమౌళి. రాజమౌళి రూపొందించిన ఏడవ చిత్రం ‘మగధీర’. ఈ సినిమా తెలుగు సినిమా రికార్డుల చరిత్రను తిరగరాస్తూ మెగాపవర్ స్టార్‌గా రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెంచింది.

రాజమౌళి సినిమాలంటేనే ప్రత్యేకమైన ఆయుధాలు ఉంటాయి. సినిమాకొక ప్రత్యెక ఆయుధాన్ని తాయారు చేసుకునే వరుసగా ఏడు సినిమాల నుంచి తను ఆవిష్కరించిన హీరోయిజాన్నీ ఆయుదల్ని పక్కనబెట్టి కమెడియన్ మర్యాద రామన్నాగా యుద్ధమే చేశాడు. అప్పటివరకు కేవలం కామెడీ నటుడుగా ఉన్న సునీల్‌తో ‘మర్యాద రామన్న’ అనే హిట్టును అందుకున్నాడు. రాజమౌళి శైలికి భిన్నంగా తీసిన ఈ సినిమా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

మర్యాద రామన్నగా అలరించిన రాజమౌళి చేసిన మరో డేరింగ్ ప్రాజెక్టు ఈగ. బుల్లి ఆకారం, శక్తి, సామర్థ్యాలు తక్కువ. ఏం చేస్తుందిలే ఈగ అని ఆషామాషీగా తీసుకుంటాం. అలాంటి అల్పజీవి ఈగనే హీరోగా చేసి…సక్సెస్ కొట్టడం ఒక్క రాజమౌళికే చెల్లింది. గ్రాఫిక్స్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమానే రాజమౌళి జీవితాన్ని మార్చేసింది. అన్ని బాషల ప్రజలదేగ్గర రాజమౌళికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా ఈగ రాజమౌళి కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఈగ తెచ్చిన యూనివర్సల్ ఇమేజే రాజమౌళిని బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తీయడంలో పురిగొల్పింది. ఇక ప్రభాస్‌, రానాలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు పార్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఈ మూవీ సక్సెస్‌ను చూసి భారతీయ చిత్ర పరిశ్రమే ఆశ్చర్యపోయింది. ఒక ప్రాంతీయ భాష చలనచిత్రం ఈ రేంజ్‌లో హిట్టు సాధించడం ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలే చేసింది. ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తెరకెక్కుతున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.

ఇండియన్ స్క్రీన్ పై తమిళ దర్శకుడు శంకర్ తరువాత అంతటి గొప్పపేరు సంపాదించుకున్నాడు రాజమౌళి. చిత్ర పరిశ్రమలో హీరోల శకం నడుతున్న ప్రస్తుత తరుణంలో హీరోలను మించిన క్రేజ్ ని దర్శకులకి తీసుకొచ్చాడు రాజమౌళి. ప్రాంతీయ చిత్రాలు తీసుకుంటూ ఎక్కడో మూలకు పడిన మన తెలుగు సినిమాను ఇంటర్నెషినల్ స్తాయిలో నిలబెట్టి, తెరపై సరికొత్త డైరెక్టరీజాన్ని ఆవిష్కరించిన రాజమౌళి, తన తదుపరి చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా బహుబాలిని మించిన విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ..హ్యాపీ బర్త్ డే టు గ్రేట్ రాజమౌళి.

Share.

Comments are closed.

%d bloggers like this: