సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..! త్రివిక్రమ్ తోనే…?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడా..? అంటే అవును అనే అంటున్నాయి సినీ వర్గాలు..! త్వరలో ఆయన సినిమాల్లో కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. పవన్ తో సినిమా చేయడానికి నిర్మాతలు చర్చలు కూడా చేస్తున్నారు.. పవన్ కూడా కథలు వింటునట్టు వార్తలు.. ఈ క్రమంలో… హిందీలో 2016 లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి మంచి హిట్ దక్కించుకున్న చిత్రం ‘పింక్’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలు పోషించారు. కోర్ట్ నేపద్యంలో నడిచే ఈ సినిమాలో అనేక ట్విస్ట్లు ఉంటాయి.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటవిశ్వరూపం చూపించారని టాక్ లేకపోలేదు.. తన నటనకు అమితాబ్ కి మంచి పేరు కూడా వచ్చింది.. క్రిటిక్ లు సైతం అమితాబ్ బచ్చన్ నటనను పొగిడారు.. అంతే కాదు తాప్సీ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. అప్పటినుండి తనని బాలీవుడ్ ఆఫర్లు వరిస్తున్నాయనే చెప్పాలి.

ఇక ఒక ఇండస్ట్రీ లో వచ్చిన సినిమా మంచి హిట్ దక్కించుకుందంటే చుట్టూ పక్కల ఇండస్ట్రీల కన్ను ఎలాగైనా పడుతుంది.. ఈ క్రమంలో ఈ సినిమా ని తమిళంలో కూడా తెరకెక్కించారు. అజిత్- శ్రద్ధా శ్రీనాథ్ లు తమిళ వర్షన్ లో నటించి వారు కూడా మంచి పేరే తెచ్చి పెట్టుకున్నారు తమిళంలో కూడా సినిమా హిట్ అవ్వడంతో మన నిర్మాత దిల్ రాజు కన్ను ఈ సినిమా పై పడింది.. వెంటనే ఈ సినిమాకి దిల్ రాజు కాపీ రైట్స్ దక్కించుకున్నాడు.. ఈ సినిమాని ఎలాగైనా పవన్ తోనే చేయించాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు.. తాను పవన్ ని అడిగినట్టు సమాచారం.. తాను మాత్రమే కాకుండా పవన్ డైరెక్టర్ త్రివిక్రమ్ ద్వారా కూడా పవన్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. కేవలం 25 రోజులు మాత్రమే పవన్ డేట్స్ అడిగినట్టు 25 రోజులు ఒక సినిమా అంటే చాలా తక్కువ వ్యవది కాబట్టి పవన్ అంగీకరించినట్టు తెలుస్తుంది.

ఇక పవన్ ఈ సినిమాలో కనుక నటిస్తే ఒక డిఫరెంట్ రోల్ లోనే కనిపిస్తాడు అని చెప్పాలి. 70 ఏళ్ల వృద్ధుడి పాత్రలో పవన్ కనిపిస్తాడు.. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్ల లాయర్ లా కనిపించాడు.. ఇక తమిళ్ లో అజీత్ మధ్య వయసు ఉన్న లాయర్ లా కనిపించాడు.. ఈ మధ్య హీరోలు తెల్ల జుట్టు తెల్ల గడ్డం వేసుకొని కనిపిస్తున్నారు.. ఇది ఓ ట్రెండ్ లా మారిపోయింది.. ఇక దిల్ రాజు కూడా పవన్ ను ఇలానే చూపించాలని అనుకుంటున్నాడట.. మరి దిల్ రాజు ఎలా చూపిస్తాడో.. అసలు పవన్ ఎలా కనపడతాడో కానీ పవన్ మరోసారి సినిమా చేస్తే మాత్రం అది అభిమానులకి పండుగే అని చెప్పాలి..!

Share.

Comments are closed.

%d bloggers like this: