ఎట్టకేలకు జగన్ కు అమిత్ షా దర్శనం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ల సమావేశమే రాష్ట్రంలో హాట్ టాపిక్.. సీఎం జగన్ అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం సోమవారం ప్రయత్నించగా అది వాయిదా పడింది.. దీంతో ఇక రాష్ట్రంలో ఎక్కడ చూసినా అనేక వదంతాలు వ్యక్తమయ్యాయి.. ఒకరు జగన్ అంటే అమిత్ షా కి చిన్న చూపు అని మరొకరు అమిత్ షా కి జగన్ కంటే నిజామాబాద్ ఎంపీ ఏ ఎక్కువ అని ఇలా అనేక వదంతులు వినిపించారు..

ఎందుకంటే అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ కి అపాయింట్‌మెంట్ దొరకడమే ఇందుకు కారణం.. ఇక వైసీపీ మద్దత్తుదారులు అమిత్ షా ని విమర్శించారు.. కేంద్రానికి ప్రాంతీయ పార్టీలంటే గిట్టవు.. ప్రాంతీయ పార్టీల మీద కేంద్రం కక్షతోనే ఇలా చేస్తున్నారు అని ఇలా అనేక వందంతులు వెల్లువెత్తాయి.. ఇక వీటన్నిటికి నేడు చెక్ పడింది. నేడు సీఎం జగన్ హోమ్ శాఖ అమిత్ షా సమావేశమయ్యారు.. రాష్ట్రంలో జరుగుతున్న అనెక విషయాల పై వీరు చర్చించారు. పైగా నేడు అమిత్ షా పుట్టిన రోజు కావడంతో జగన్ ఆయనకి ప్రత్యేక శుభాకాంశాలు కూడా తెలియజేశారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ నిధులు, సమస్యలతో పాటూ మరికొన్ని కీలక అంశాల గురించి విన్నవించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగరం సురేష్, భరత్‌లు ఉన్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత మధ్యాహ్నం కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో జగన్ భేటీకానున్నారు. అనంతరం కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతోనూ సమావేశం అవుతారు. కేంద్రమంత్రులతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకోనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: