పవన్ రీ ఎంట్రీ ఫిక్స్.. నిర్మాత ఏఎం రత్నం అధికారిక ప్రకటన..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌. అందరి హీరోల అభిమానులకు పవన్‌ అభిమానులకు చాలా తేడా ఉంటుంది. పవన్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన కథానాయకుడి కోసం ఏం చేయడానికైన సిద్ధపడతారు. అందుకే ఆ అభిమానులను చూసుకొని పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పొలిటికల్ గా ఈ ఎన్నికల్లో పవన్ అనుకున్నంత రాణించలేకపోయాడు. ప్రస్తుతం రాజకీయంగా పవన్ కు స్తబ్దత ఉండడంతో దాన్ని సినిమా వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లోకి రావాలని ఆశిస్తున్నా తనను మళ్ళీ రాజకీయంగా లైట్ తీసుకుంటారేమో అని భయపడుతున్నాడు.

అందుకే ఎంత మంది సినిమా కథలతో వచ్చినా చేయనని చెప్పట్లేదు, చేస్తానని మాటివ్వట్లేదు. చూద్దాం అన్నట్టుగానే ఉంది పవన్ పరిస్థితి. ఇప్పటికే పవన్ ఓకే అంటే బాలీవుడ్ పింక్ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు దిల్ రాజు. అంతెందుకు రాంచరణ్ కూడా బాబాయి సిగ్నల్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు . మరి ఈ నేపథ్యంలో ఒక సరికొత్త వార్త బయటికొచ్చింది. ఎట్ లాస్ట్ పవన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని. ఒకప్పటి బారి సినిమాల నిర్మాత ఏఎం రత్నం బ్యానర్లో పవన్ సినిమా చేయబోతున్నాడట.., మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని బుర్ర సాయి శ్రీనివాస్ రచన సహకారంతో తెలుగులో ఈ సినిమా ఉండ బోతుందట. టెస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఏఎం రత్నం అంటే పవన్ కి చాలా అభిమానం, ఇష్టం కూడా… ప్రస్తుత ఏ ఎం రత్నం ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా కూడా ఇండస్ట్రీలో ఎలాగైనా ఏఎం రత్నంని నిలబెట్టాలని పవన్ యనకు ఈ గోల్డెన్ అపర్ చ్యునిటి ఇచ్చాడట. అతిత్వరలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ నుండి అధికారిక ప్రకటనతో పాటు, పూజ కార్యక్రమాలను కూడా ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: