జార్జ్ రెడ్డి కోసం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది..ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదలవుంతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ని గ్రాండ్ స్కెల్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ అప్పటికి పెద్దగా టాక్ లేని జార్జ్ రెడ్డి ట్రైలర్ విడుదల తరువాత ఒక్కసారిగా సంచలనంగా మారింది. ముఖ్యంగా యువత జార్జిరెడ్డికి క్రేజీ ఫాన్స్ గా మారిపోయారు. వారి ఫోన్స్, ఇన్స్టా , ఎఫ్ బి ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో జార్జ్ రెడ్డి బొమ్మలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కూడా ఈ ట్రైలర్ చూసి మెస్మరైజ్ అయ్యాడట. వెంటనే జార్జి రెడ్డి దర్శకుడుజీవన్ కి కాల్ చేసి అభినందించాడట, జార్జి రెడ్డి లాంటి రియల్ సూపర్ హీరో కథలు ఇప్పటి యువతకు ఎంతో అవసరమని, ఈ సినిమా కోసం నా సహకారం ఎప్పటికి ఉంటుందని పవన్ మాట ఇచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు జార్జి రెడీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాల్సిందిగా ‘జార్జ్ రెడ్డి’ టీమ్ పవన్ కళ్యాణ్ ను కోరడంతో తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారట. అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్ర ఈవెంట్ కు హాజరు అయితే సినిమాకు మంచి హైప్ రావటం ఖాయమని, ఆ తరువాత సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని నిర్మాతలు విశ్వసం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: