వర్మ ట్రైలర్ లో కలకలం.., జగన్ కొట్టింది ఆ బడా వ్యక్తినేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది కేవలం వర్మకేనా అనే ధర్మ సందేహం కలుగుతుంది ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ చూసిన చాలామంది ప్రేక్షకులకి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని వర్మ తన సినిమాలో చూపించిన విధానం పక్కన పెడితే, ఈ ట్రైలర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తప్పుచేసినోడి చెంప పగలకొట్టిన షాట్ పలు వివాదాలకు దారితీస్తుంది. అసలా ఆ వ్యక్తి ఎవరు, అతన్ని జగన్ ఎందుకు కొట్టారన్న అంశంపైనే జగన్ అభిమానులంత చర్చించుకుంటున్నారు.
కంటెంట్, టేకింగ్ లపై ఎప్పుడో పట్టుకోల్పోయిన వర్మ, తన సినిమాలా కాంట్రవర్సీస్ తో మాత్రం నిత్యం వార్తల్లో ఉండటం వర్మ స్టయిల్.

వర్మ రీసెంట్ సేన్సేషన్ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌లో మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు స్పష్ఠంగా తెలుస్తూనే ఉంది. అలాగే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను సైతం వదలకుండా వర్మ పైత్యాన్ని మొత్తం చూపించేశారు. వీరే కాకుండా ప్రధాని మోదీ నుండి అమిత్ షా, కేఏ పాల్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలకుండా మొత్తం అదరినీ చుట్టేశారు వర్మ. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ట్రైలర్‌లో జగన్ పాత్రధారి ఒక వ్యక్తిని లాగిపెట్టి చెంపచెల్లు మనిపించే సీన్ ట్రైలర్‌లో హైలైట్ అయ్యింది. ఇంతకీ జగన్ ఎవర్ని కొట్టాడు? అంత కోపం జగన్‌కి ఎందుకొచ్చింది? ఎవరా వ్యక్తి అంటే.. అప్పట్లో జగన్ ఓ టీవీ ఛానల్ సీఈఓను కిడ్నాప్ చేసి కుమ్మేశాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్మ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బలు తింటున్నది ఎవరో కాదు.. ఆ టీవీ ఛానల్ సీఈఓ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లో జగన్ చేతిలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి చూడ్డానికి రౌడీలా ఉండటం.. మరో సీన్‌లో అతనే షాప్‌లను తగలబెడుతున్నట్టుగా కనిపించడం ఇతను అతనేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆ టీవీ ఛానల్ సీఈఓ పాపం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. మళ్లీ అతన్ని వర్మ తెరపైకి తీసుకువచ్చి పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారా? లేక జగన్ చేతిలో దెబ్బలు తిన్న మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తెలియాలంటే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: