హాలివుడ్ రేంజ్ లో బన్నీ- సుకుమార్ “లా” సినిమా స్టోరి లైన్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ కి స్టార్ డం తీసుకొచ్చి సుకుమార్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య . ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ బ్లాక్ బస్టర్ రంగస్తలం తరువాత ఫిలిం అవ్వటంతో సుకుమార్ పై ఏర్పడ్డ బారి అంచనాల దృష్ట్యా , ఈసారి బన్ని కోసం ఒక ఇన్నోవేటివ్ స్టోరి లైన్ ని సుకుమార్ రెడీ చేసారట, టాలివుడ్ లో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఈ లైన్ పై ఇండస్త్రిలో పెద్ద చర్చే సాగుతుంది. మాస్ హీరో అయినా బన్నిపై ఇలాంటి ప్రయోగాలూ ఫలిస్తాయో లేదో అంటూ బన్ని ఫాన్స్ ఒకటే వర్రీ అవుతున్నారట ..,

ఇంటలిజెంట్ మైండ్ గేమ్స్ , ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఇన్నోవేటివ్ ఐడియాస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ సుకుమార్ . సుకుమార్ సినిమా చూడటం అంటే మన మెదడుకి పని చెప్పలిందే. మనిషి ఆలోచన శక్తికి పనిపెట్టే లాజిక్స్ తో సినిమాలు తీసే సుకుమార్ ప్రయోగాలు చాల సార్లు సఫలం అయినా కొన్ని సార్లు బెడిసికొట్టాయి కూడా. జగడం, ఆర్య-2, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో ఇవన్ని మాస్టర్ పీస్లు అయినా అనుకున్నంత కమర్షియల్ హిట్స్ కావు. కారణం సామాన్యుడి మెదస్సుకి అందని ప్రయోగాలు. అందుకే రాంచరణ్ తో రంగస్తలం వంటి కమర్షియల్ కథతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన సుక్కు, బన్నితో మల్లి తన పాత పంథానే ఎంచుకున్నాడట.
రీసెంట్ గా పూజాకార్యక్రమాలు పూర్తిచేస్కున్న బన్ని సినిమాకి ఒక అండర్ వరల్డ్ మాఫియ క్రైమ్ డ్రామాను సిద్దం చేసాడట సుకుమార్. అయితే ఇందులో మాఫియ డాన్స్ అందరు గన్స్ తో కాకుండా బ్రెయిన్ తో సెటిల్ మెంట్స్ చేస్తుంటారట. రక్తం చుక్క పారకుండా క్రైమ్స్ చేసే ఇలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ ఎత్తులకి హీరో బన్ని ఎలాంటి పైఎత్తులు వేస్తాడు, మాఫియకి హీరోకి మధ్యలో జరిగే మైండ్ గేం చుట్టురా సుకుమార్ కథని సిద్దం చేసాడని ఫిలిం నగర్ టాక్. అయితే హాలివుడ్ స్తాయి మైండ్ గేమ్ థ్రిల్లర్స్ తీసి ఎన్నోసార్లు చేతులు కాల్చుకున్న సుకుమార్ బన్నితో మల్లి ఇలాంటి ప్రయోగాలు చేయటం ఇప్పుడు బన్నీ ఫాన్స్ ని కలవరపెడుతుందట. మాస్ కమర్షియల్ ఫ్యాన్ బేస్ ఉన్న బన్నితో సుకుమార్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే .

Share.

Comments are closed.

%d bloggers like this: