వైరల్ అవుతున్న ఫైటర్స్ స్క్రిప్ట్ హైలైట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి ఎంత ఎగ్జయిటెడ్ గా ఉన్నాడో తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్రాన్ని కూడా ప్రకటించేశాడు. జెట్ స్పీడ్ తో పూరి-ఛార్మి బృందం స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయారు. గోవా వెళ్లి మరి స్క్రిప్టు రాస్తున్న పూరి స్టోరి నుండి విజయ్ ఫాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఈసారి స్క్రిప్ట్ పక్కగా ప్లాన్ చేసాడట పూరి. విజయ్ దేవరకొండ ఇమేజిని దృష్టిలో పెట్టుకొని , హీరో క్యారెక్టరైజేషన్ ని మైండ్ బ్లోయింగ్ గా డిసైన్ చేసాడట..,

పూరి రైటింగ్స్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. కథ పరంగా ఫెయిల్ అయినా హీరో ఎలివేషన్ , హీరో క్యారెక్టరైజేషన్స్ మాత్రం పూరి సినిమాలో పీక్స్ లో ఉంటాయి. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఉన్న పూరికి స్టార్ హీరో డేట్స్ దొరుకుతుంటాయి. వరుస ఫ్లాప్స్ తో వెనుకపడ్డ పూరి ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యి ఏకంగా స్టార్ విజయ్ తోనే ఫైటర్ అనే సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకథ ఎలా ఉంటుంది, విజయ్ ఆల్ట్రా క్లాస్ కి పూరి ఊర మాస్ స్టైల్ మ్యాచ్ అవుతుందా, రౌడీ ఫాన్స్ కి పూరి రైటింగ్స్ కిక్ ఇస్తుందా అని ఎన్నో సందేహాల్ని పటాపంచలు చేస్తూ పూరి స్క్రిప్ట్ పై మొదటిసారి నోరు విప్పాడు. ఫైటర్ స్క్రిప్ట్ హైలైట్ గా వస్తుందని, విజయ్ ఎస్ అనగానే షూటింగ్ మొదలుపెడతానని మీకు మాత్రమే చెప్తా ఆడియో వేడుకలో రౌడీ ఫాన్స్ కి లీకులు ఇచ్చేసాడు పూరి జగన్నాథ్.
అయితే ఇందులో విజయ్ క్యారెక్టరైజేషన్ పవర్ ఫుల్ గా ఉంటుందని పూరి టీం నుండి అందుతున్న మరో సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్ర నెగిటీవ్ షేడ్స్ లో ఉంటుంది అట. ఇల్లీగల్ బిజినెస్ చేసే హీరోయిన్ కి అపోనేంట్ విలన్ గా హీరో పాత్ర ఉంటుందట. ఈ ఇద్దరు ఒకర్ని మించి ఒకరు ఇల్లీగల్ దంధాలు, క్రైమ్స్ , స్మగ్లింగ్స్ చేస్తుండగా, హీరో పోలీసులకి లీక్ ఇచ్చి హీరోయిన్ ని పట్టించటం, హీరోయిన్ హీరోని తొక్కాలని చూడటం, ఇలా హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలు నెగిటీవ్ గానే ఉంటాయట. అయితే హీరోయిన్ అంటే మంచిదై ఉండాలి, విలన్ చేతిలో కష్టాల్లో చిక్కుకోవాలి, అప్పుడు హీరో వచ్చి సేవ్ చేయాలి.., ఇలాంటి రొటీన్ కథలకు అలవాటైన తెలుగోళ్ళకి హీరోయిన్ హీరో ఇద్దరు నెగిటివ్ రోల్స్ అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో ఈ సినిమ విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: