షూటింగ్ లో రాజమౌళికి చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రీకరణ దాదాపు సగానికి పైగా పూర్తవ్వొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ పై చిత్రీకరణ జరుపుతున్నాడట రాజమౌళి. అయితే షూట్ లో ప్రతి షాట్ షాట్ కి రాజమౌళికి ఎన్టీఆర్ చుక్కలు చూపెడుతున్నాడట. ఎన్టీఆర్ చేస్తున్న దానికి అవాక్కవ్వాల్సివస్తుందట రాజమౌళికి. అంతటి జక్కన్ననే ఆశ్చర్య పరుస్తున్న అంశం ఏంటి, అసలు షూట్లో ఎన్టీఆర్ అంతలా చేస్తుంది ఏమిటో చూద్దామా..,

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో తారక్ గురించి మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడి పరిచయ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే తారక్ పై ఇంట్రడక్షన్ సన్నివేశాల చిత్రీకరించారట. ఆయా సన్నివేశాల్లో తారక్ పెర్సామెన్స్.. డైలాగ్స్ మాడ్యులేషన్ చూసి జక్కన్న సైతం షాక్ అయ్యాడుట. జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇంత బెస్ట్ ఇవ్వడానికి కారణం తనకు ఇష్టమైన దర్శకుడు రాజమౌళినే కారకుడని తారక్ అంటున్నాడుట. ఇద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్.. స్క్రిప్ట్ డిమాండ్.. డైలాగుల్లో బలమే.. ది బెస్ట్ ఇవ్వడానికి కారణమని సన్నిహితుల వద్ద అంటున్నాడుట. సాధారణ సన్నివేశాల్లోనే తారక్ నట విశ్వరూపం చూపిస్తాడు. ఇలాంటి అరుదైన పాత్ర దక్కితే వదిలిపెడతాడా? అంటూ ప్రచారమవుతోంది. ఈ వార్తల నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారక్ ఆల్వేస్ ది బెస్ట్ పెర్పామర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకూ తెరకెక్కించిన సన్నివేశాల విషయమై చిత్ర నిర్మాత కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ చరణ్ కు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది చిత్రాన్ని ఈ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: