తిప్పరా మీసం ప్రివ్యు టాక్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

విభిన్న చిత్రాల నటుడు శ్రీవిష్ణు హీరోగా కృష్ణ విజయ్‌ ఎల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మరో ఇంట్రస్టింగ్ మూవీ తిప్పరా మీసం. ఇన్నాళ్లు సాఫ్ట్ రోల్స్‌ మాత్రమే చేసిన శ్రీ విష్ణు ఈ సినిమాలో నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు మరికొన్ని గంటల్లో మనముందుకు రాబోతుంది.

టీజర్స్ ట్రైలర్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తిప్పరామిసంపై ఇండస్ట్రీ టాక్ ఏంటి, అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్లకు కదిలిచ్చేంత హైప్ ని తీసుకురావటంలో టీమ్ సక్సెస్ అయ్యిందా..?

కేవలం యూత్ ఆడియన్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన సినిమా టీమ్ మాస్ ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలైతే ఈ సినిమాలో ఎక్కడ కనిపించకపోవటం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు.

హీరో శ్రీ విష్ణు తల్లి పాత్రలో రోహిణి నటించినా, అక్కడక్కడా ట్రైలర్ లో సెంటిమెంట్ సీన్లు కనిపించినా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాలా అయతే కనిపించటం లేదు.
ఇక మాస్ ని ఆకట్టుకునే ఫైట్స్, పంచ్ డైలాగ్స్, ఐటం సాంగ్స్, లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఏమి లేవు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఇది చిన్న సైజ్ అర్జున్ రెడ్డిలా కనిపిస్తుంది.

అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్రను ఏ షేడ్స్ లో అయితే డిజైన్‌ చేశారో దాదాపుగా శ్రీ విష్ణు పాత్ర కూడా అదే తరహాలో ఉంది. డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి కథే తిప్పరామీసం.

అయితే ఇండస్ట్రి లో ఇప్పటికే పడిపోయిన ప్రివ్యు టాక్ ప్రకారం, ఈ సినిమాలో రోహిణి, శ్రీవిష్ణుల మధ్య వచ్చే మదర్‌ సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయని, శ్రీవిష్ణు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని, మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోయే ఫీల్ గుడ్ డ్రామా అని, ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇండస్ట్రీ నుండి వస్తున్న ప్రివ్యూ టాక్. అయితే మరికొన్ని గంటల్లో ఈ సినిమా భవిష్యత్తు తేలనున్న సందర్భంగా తిప్పారా మూవీ టీమ్ కి అల్ ద బెస్ట్ .

Share.

Comments are closed.

%d bloggers like this: