ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియాలోకి పవన్ కళ్యాణ్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి బయోపిక్ విడుదలకు ముందే పెను సంచలనాలకు వేదికవుతుంది. టీజర్, సాంగ్స్ , ట్రైలర్స్ అన్ని తెలుగు రాష్ట్రాల యువతకు డ్రగ్స్ లా ఎక్కుతున్నాయి. ఏకంగా నాగబాబు వంటి సెలబ్రేటిస్ ‘ ఇందిరా బయో పిక్ అంటే ‘ అంటూ స్వచ్ఛదంగా ప్రచారం చేస్తున్న వేళా , ఇప్పుడు పవర్ స్టార్ కూడా ఒక సంచలన నిర్ణయానికి వచ్చేసాడు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఈ నిర్ణయమే మరో అద్భుత సంఘటనకు వేదికవ్వనుంది.

మూడు పదుల వయసు కూడా నిండకుండా నే ఉద్యమ కెరటం గా నిలిచి బడా బాబుల కు దడ పుట్టించిన గొప్ప స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి. ఉస్మానియా స్టూడెంట్స్ పై జరుగుతున్న అకృత్యాల కు మరియు తక్కువ జాతి వారి పై అగ్ర కులాల వారు చేస్తున్న దాడులకు వ్యతిరేకం గా జార్జ్ రెడ్డి చేసిన పోరాటానికి బహుమతిగా ముప్పై రెండు కత్తి పోట్లకు గురైన జార్జి రెడ్డి శవాన్ని పాతేయటం జరిగింది. ఇంతటి రెబల్ స్టూడెంట్ లీడర్ అంటే మన పవర్ స్టార్ కి కూడా ఎంతో ప్రేమ. అందుకే ఈనెల 17న జరుగబోతున్న సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ఒప్పుకున్నట్లు గా సమాచారం అందుతోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఉస్మానియా యూనివర్సిటీలో జరిపేందుకు జార్జ్ రెడ్డి టీమ్ సన్నాహాలు చేస్తుంది.
అయితే జార్జి రెడ్డి టీమ్ లో పవన్ సన్నిహితులు ఎవ్వరు లేకున్నా జార్జ్ రెడ్డి పై ఉన్న అభిమానం తోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నట్లు గా సమాచారం అందుతోంది. జార్జ్ రెడ్డి సినిమా లో ప్రధాన పాత్రను సందీప్ మాధవ్ పోషించగా దళం ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ అందించారు. పీరియాడిక్ డ్రామా అవ్వడం తో ఈ సినిమా విభిన్నం గా వైవిధ్య భరితంగా ఉంటుందనే నమ్మకం తో సినీ వర్గాల వారు ఉన్నారు. ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతున్నట్లు గా అనిపిస్తుంది. జార్జ్ రెడ్డి గురించి తెలిసిన వారికి మరియు తెలియని వారికి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత కనిపిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: