జార్జి రెడ్డి రివ్యూ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

అడుగడుగునా ఆంక్షలు, రాజకీయ నాయకుల బెదిరింపులు, ఉస్మానియా విద్యార్థుల నిరసనలు.., ప్రమోషన్స్ కి కావాల్సినంత వివాదాలతో గడిచిన కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది జార్జి రెడ్డి సినిమా. ఓయూ లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ బయో పిక్ అత్యంత బారి అంచనాలతో ఈ రోజే విడుదలైంది. మరి ప్రేక్షకుల పీక్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి జార్జి రెడ్డి ఎంతవరకు రీచ్ అయ్యింది, అసలీ ఈ సినిమాపై గ్రౌండ్ లెవెల్ టాక్ ఏంటి..? లెట్స్ వాచ్ ది రివ్యూ..,

కథ…. :

విప్లవకారుడు జార్జి రెడ్డి రియల్ హిస్టరీని డాక్యుమెంట్ చేయడానికి హైద్రాబాద్ కి వస్తుంది ఒ ఫారిన్ స్టూడెంట్. జార్జి రెడ్డి ఫ్రెండ్స్ , క్లాస్ మేట్స్ ని వరుసగా కలుస్తూ జార్జి రెడ్డి గతాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉంటుంది. అరవై సంవత్సరాల క్రితం, అప్పటి విద్యాసంస్థల్లో ఉండే కుల వివక్ష, అగ్ర వర్ణాల ఆధిపత్యం, వంటి క్యాపిటలిజాన్ని సహించని జార్జి రెడ్డి …,విద్యార్థి హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేసాడు, అంతిమంగా ఎం సాధించాడు.., అసలు ఆ ఫారిన్ స్టూడెంట్ కి జార్జి రెడ్డికి ఉన్నా సంబంధం ఏంటన్నదే అసలు కథ.

కథనం విశ్లేషణ…. :

ప్రేక్షకుడు ఏ సినిమాకొచ్చిన, ఆ సినిమా హీరోలో తమని తాము వెతుక్కోవటం సహజం. ముఖ్యంగా జార్జి రెడ్డి లాంటి హై వోల్టేజ్ సినిమాలోని హీరోనైతే కంప్లీట్ గా ఓన్ చేసేసుకుంటాడు ఆడియన్. జార్జి రెడ్డ్డి సినిమాకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ కూడా ఇదే . సినిమా మొదలవ్వకముందే జార్జి రెడ్డి తో లవ్ లో ఉంటాడు ఆడియన్. అతన్ని పీక్ లెవెల్లో ఇంప్రెస్స్ చేయకపోయినాపర్వాలేదు కానీ కనీసం డిస్సప్పాయింట్ అవ్వకుండా చూసుకోవాలి. జీనా హై తో మర్నా సీకో, కథం కథం పర్ లడ్నా సీకో లాంటి ఆవేశబరిత ట్రైలర్స్ చూసి జార్జి రెడ్డి కోసం థియేటర్ లో కూర్చున్న ఆడియన్ మూడ్ ఎలా ఉంటుంది…అసలీ జార్జి రెడ్డి ఎవరు ఎక్కడినుండి వచ్చాడు చిన్న వయసులోనే బడా రాజకీయ నాయకుల వెన్నులో వణుకేలా తెప్పించాడు, ఆఖరికి జార్జి రెడ్డి ఏమైపోయాడు, అని ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్నా ఉత్సాహంతో థియేటర్లో కూర్చున్న ఆడియన్ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. కానీ సినిమా స్టార్ట్ అయినా కొద్దీ సేపటికే అర్ధం అవుతుంది .., మనం చూస్తుంది సినిమా కాదు డాక్యుమెంటరీ అని. సినిమా రన్ అవుతున్న కొద్ది , ఏ న్యూస్ పేపర్లోనో, లేక పుస్తకాల్లోనో జార్జి రెడ్డి గురుంచి చదువుతున్నామా అని డౌట్ వచ్చేలా ఉంటుంది జార్జి రెడ్డి స్క్రీన్ ప్లే. ఏమాత్రం డెప్త్ ఏమోషన్స్ లేకుండా, పై పైనా కథను చెప్తూ, సినిమాకి సరిపడా డ్రామాను డిజైన్ చేయటంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు దర్శకుడు జీవన్ రెడ్డి. డాక్యుమెంటరీ తీయాలన్న ఫారిన్ గర్ల్ ఇండియాలో ఎవర్ని కలుస్తుంది, వారికి జార్జి రెడ్డి కి ఉన్న సంబంధం ఏంటన్న డీటెయిల్స్ ఎక్కడ ఉండవు. మనం చెప్పకుండానే ప్రేక్షకుడికి అర్ధమవ్వుతుంది లే అని చేసిన ఇంటలిజెంట్ స్రీన్ ప్లే నా, ఇగ్నో రెన్సా అన్నది పక్కన పెడితే అన్ ఫార్చ్యూ నెట్లీ జార్జి రెడ్డి మాత్రం మిస్ ఫైర్ అయిందని గ్రౌండ్ లెవెల్ టాక్ చెప్తుంది. ప్రతి స్టూడెంట్ ఎంతో గౌరవించే జార్జి రెడ్డి బయో గ్రఫీ పై ఇంకాస్త లోతుకెళ్లి క్రిటిసైజ్ చెయ్యటం కంటే, ఈ బయో గ్రఫీని మరొక్కరు ఇంకోసారి తీస్తే బెటర్ అని నెటిజన్స్ లో ఇప్పటికే చర్చ మొదలైంది .

Share.

Comments are closed.

%d bloggers like this: