నేనున్నాను… నేనువిన్నాను… అంటూ చిలక పలుకులు పలికే నేతలు నేడు ఎక్కడా కానరావడం లేదు…

Google+ Pinterest LinkedIn Tumblr +

నేనున్నాను… నేనువిన్నాను… అంటూ చిలక పలుకులు పలికే నేతలు నేడు ఎక్కడా కానరావడం లేదు…
నేతల మాటలన్నీ నీటి మీద రాతలే అన్న చందాన ఉంది ఏపీలో ప్రజాప్రతినిధులు పరిస్ధితి. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. ఏ దుర్వార్త ఎప్పుడు వినాల్సివస్తుందో తెలియదు. ఏ రూపంలో వైరస్ వ్యాపిస్తుందో అర్ధంకావడం లేదు. మీ పెద్దకొడుకులా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రజలలో మనోధైర్యం నింపేవిధంగా ఎక్కడా మాట్లాడలేదు… అతని నాయకత్వంలో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు పరిస్ధితి కూడా దాదాపు ఇదేవిధంగా ఉంది. కృష్ణా జిల్లాలో కరోనా వేళ పాలకుల పనితీరుపు స్పెషల్ గ్రౌండ్ రిపోర్టు….

ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి… జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి… 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా మచిలీపట్నం పార్లమెంట్ స్ధానాలలో వైసీపీ విజయం సాధించింది. ఇక విజయవాడ పార్లమెంటు, విజయవాడ తూర్పు, గన్నవరం అసెంబ్లీ నియోజవర్గం టీడీపీ విజయం సాధించింది. ఇక ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో కూడా దాదాపు వైసీపీ తన ఆదిపత్యాన్ని ప్రదర్శించింది… పార్టీలు, ఎన్నికలు పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న పాండమిక్ పరిస్ధితులలో ప్రజలు అల్లాడిపోతున్నారు. కాని మనం గెలిపించుకున్న నేతలు జాడ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు…

జిల్లాకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ముగ్గురుకు మంత్రి పదవులు ఒకరకి విప్ పదవి ఇచ్చారు… వీరిలో తూర్పుకృష్ణలో కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా ఉంటే… విజయవాడ సిటీలో వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఇక పశ్చిమకృష్ణ నుంచి సామినేని ఉదయభాను ప్రభుత్వ విప్ గా ఉన్నారు…. మంత్రి కొడాలి, పేర్నిలది ఢిపరెంట్ స్టైల్… ఎదుటివాడిని ముఖంమీద కొట్టినట్లు మాట్లాడేతత్వం కొడాలి కుంటే… పక్కోడికి కూడా పెయిన్ తెలియకుండా పంచ్ లతో అదరగొట్టితత్వం పేర్నిది… వీరిద్దరూ ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఏదో రకంగా మీడియాలో కనిపించి ప్రజలకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు మాత్రం కొడాలి అంటే అమితమైన అభిమానం చూపిస్తారు… నియోజకవర్గంలో ఏకుటుంబంలో ఆపదొచ్చినా కొడాలి అక్కడ ప్రత్యక్షమైవుత్వారని ప్రజలు నమ్ముతారు… అలాంటి కొడాలి సైతం కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కడ ప్రజల చెంతకు వెళ్లిన పరిస్ధితి కనిపించలేదు. ఇక పేర్ని నాని వేకువజామూనే బైక్ పైనా సైకిల్ పైనా చక్కెర్లు కొట్టేవాడు… ప్రజా సమస్యల కోసం అంటూ ప్రజల ముంగిట వాలిపోయే అలవాటు ఉంది. కాని ఈ పాండమిక్ పరిస్ధితులలో పేర్నీ కూడా పెద్దగా నియోజకవర్గంలో కనిపించలేదు… తూర్పుకృష్ణాలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు వెంకట పార్ధసారధి, పామర్రు కైలే అనిల్ కుమార్ లు అక్కడక్కడ అధికారిక కార్యక్రమాలుంటే కనిపించి వెళ్లిపోతున్నారు. వీరెవ్వరూ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు వీరికి ఏమీ కావాలో వైద్యం ఏలా అందుతుందో వైద్యులు అందుబాటులో ఉంటున్నారో లేదో అన్న అఁశాలేవీ వీరు పట్టించుకోలేదు… కాని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీపై విజయం సాధించి, ఆ తర్వాత వైసీపీ సానుభూతిపరుడుగా మారిని వల్లభనేని వంశీ మాత్రం ఒకింత చేయూత అందించారు… ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్న ప్రజల కష్టాలను చూసి చలించిన వంశీ దాదాపు 100కు పైగా ఆక్సిజన్ సిలెండర్లను కొనుగోలు చేసి వివిధ హాస్పటల్స్ కు అందించాడు…. అతని నియోజకవర్గం విజయవాడ సిటీకి అతిసమీపంలో ఉండటంతో అతను కొనుగోలు చేసిని ఆక్సిజన్ సిలెండర్లను

పశ్చిమకృష్ణలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రభుత్వ విప్ గా ఉన్నారు. ఈ నియోజకవర్గం తెలంగాణ ఆంధ్రా బోర్డర్ గా ఉంది… సాధారణంగా నియోజకవర్గంలో పెద్దగా తిరగకపోయినా… ఇటీవల తెలంగాణలోకి అంబులెన్స్ లు నిలిపివేసినప్పుడు తెలంగాణ పోలీసులు దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడి పంపించే ప్రయత్నం చేసారు. ప్రభుత్వ పాలసీ కావడంతో అదిసాధ్యం కాలేదు… తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు నందిగామ ఎమ్మెల్యే మెండితొక జగన్మోహాన్ రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు వీరు కూడా కరోనా సమయంలో పెద్దగా ప్రజలు చేసిందేమి లేదనే చెప్పాలి. అయితే ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు ఓపెనింగ్ లో మాత్రం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమైవుతున్నారు…

విజయవాడ సిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. వీరిలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనినాస్ మంత్రిగా ఉంటే, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్టు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా ఉన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ విజయం సాధిస్తే సీనియర్ నేత గద్దే రామ్మోహాన్ రావు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురు నామమాత్రంగా మాత్రమే ప్రజలలోకి వెళ్తున్నారు. మంత్రి వెల్లంపల్లి పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమైయ్యారు. ఒక ఎమ్మెల్యేలా డివిజనల్లలో ఉదయం పూట కొద్దిసేపు కనిపిస్తారు. ఆతర్వాత ఎక్కడా ఆయన జాడ ఉండదు. ఇక ఎమ్మెల్యే మల్లాది విష్ణుది కూడా దాదాపు అదేపరిస్ధితి ఉదయం పూట స్ధానిక కార్పోరేటర్ల సహాకారంతో ఒకటి రెండు డివిజన్లలలో ప్రత్యక్షమైవుతారు… టీడీపీ ఎమ్మెల్యే గద్దె సహాజంగా ప్రజలకు చేరువుగా ఉంటారు… కాని ఈ సారి ఎక్కడా ప్రజలలో మమేకమైవ్వడం లేదు… కార్యాలయానికే పరిమితమైయ్యారు.. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జి దేవినేని అవినాష్ మాత్రం కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నారు… విజయవాడ సిటి కావడం కార్పోరేట్ ఆసుపత్రులు ఎక్కువుగా ఉండటం వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడకు చేరుకుంటారు. వారు పడతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు అవేవి వీరెవ్వరూ పట్టించుకునే పరిస్ధితి లేదు… కనీసం ప్రభుత్వ అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు అవసమరైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం భాదాకరం

 

జిల్లాల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడుగా కేశినేని నాని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడుగా బాలశౌరి ఉన్నారు. వీరిద్దరది వేర్వేరు పార్టీలు… ఈ సెకండ్ వేవ్ రోజులలో విజయవాడ ఎంపి కేశినేని నాని మాట ఎక్కడా వినిపించలేదు. కార్పోరేషన్ ఎన్నికల తర్వాత అతను మళ్లీ మాట్లాడలేదు… సహాజంగా పార్టీలకు అతీతంగా కష్టకాలంలో ప్రజలకు చేరవుగా ఉండేందుకు ప్రయత్నం చేసే నాని మౌనం ఎందుకుదాల్చారో అర్దం కావడం లేదు… మచిలీపట్నం బౌలశౌరి నియోకవర్గంలో కనిపించింది వేళల్లో లెక్కపెట్టవొచ్చు… కరోనా కాలంలోనే కాదు సాధారణ రోజులలో కూడా బౌలశౌరి ఓటు వేసిన ఒటర్లను చూసింది లేదు… ఇక ఇలాంటి ప్రమాదకర పరిస్ధితులలో అతను వస్తాడు ఏదో చేస్తాడనే ఆలోచన ప్రజలకు లేదనే చప్పాలి….

జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఎంత మంది ఉన్నా… పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. నియోజకవర్గస్ధాయిలో అధికారులతో మాట్లాడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారనికి కనీసం కృషి చేయకపోవడం చర్చాంశనీయంగా మారింది… కష్టాల్లో ఉన్న కుటుంబానికి నేనున్నాను అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలలో మనోధైర్యం పెరుగుతోంది…. కానీ ఓట్లు వేసటప్పటికి కదా ఇప్పుడు మనకెందుకెలా అనుకుంటున్నారో ఏమిటో కాని గ్రౌండ్ లో మాత్రం ఎవరూ కనిపించకపోవడం విశేషం…

Share.

Comments are closed.

%d bloggers like this: