పకడ్బంది లాక్‌డౌన్….ఉల్లంగిస్తున్న వాహనదారులు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకు అమాంతంగా పెరుగుతు జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. వ్యాక్సిన్ అంటూ ప్రచారం జరిగినా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికేస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వంటి అత్యాధునిక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్‌తో బ్రతుకిమీద అశలు కలిగించేలా చేస్తున్నా కేసులు మాత్రం అంతకంతకూ గణనీయంగా పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో ప్రభుత్వాలకు ఏం చేయాలో తెలియక లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి.

దీంతో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇక కొంతైన కేసుల ప్రభావాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్భంధీగా అమలుకు వ్యూహాలు రచిస్తున్నారు. కొంతమంది వాహానాదారులు మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు. విచిత్రమైన సమాధానాలతో పోలీసుల ఉచ్చులో పడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: