అడవి బిడ్డలకు అండగా సీతక్క

Google+ Pinterest LinkedIn Tumblr +

దనసరి అనసూయ అలియాస్ సీతక్క…. రెండు తెలుగు రాప్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనేది కాదనలేని వాస్తవం. ఆమే రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును లిఖించుకున్నారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అనునిత్యం పేద ప్రజల బాగు కొరకు పరితపిస్తూ నూతన రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న సీతక్క తదనంతర పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ప్రభావంతో పేద ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. సాధారణంగా ఎమ్మెల్యేలు కారులో షీకారు చేస్తూ గుర్తోచ్చినప్పుడు ప్రజలు వద్దకు వస్తారు. కానీ వీరికి భిన్నంగా నడుచుకుంటున్నారు ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్‌తో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. దీంతో వైరస్ సోకిన వారిని పట్టించుకునే నాదుడే కరువైన సమయంలో పేద ప్రజల దేవతగా అవతరించారు.

అనునిత్యం అడవి బిడ్డల క్షేమం కోరుతూ గుట్టలు, కొండలు తిరుగుతు అడవి బిడ్డలకు నిత్యవసర సరుకులే కాక గుండెల నిండా భరోసా నింపుతున్నారు ములుగు ముద్దు బిడ్డ. పట్టణాలకు దూరంగా, అడవిని నమ్ముకుని ఉన్న అభాగ్యులకు భాసటగా నిలుస్తోంది మన సీతక్క. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సీతక్క పేరు మారుమోగుతోంది. వైరస్ భారిన పడిని వారిని అక్కున చేర్చుకుంటూ అభినవ మథర్ థెరిస్సాగా వెలుగొందుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: