ఇక మాస్క్‌లకు గుడ్ బై…

Google+ Pinterest LinkedIn Tumblr +

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయటంతో కేసుల సంఖ్య అమాంతంగా తగ్గిపోయింది. దీంతో మాస్కులతో, షానిటైజేషన్‌తో పనిలేదు. ఏంటి..? తెలుగు రాష్ల్రాల్లో రోజు రోజుకు కేసులు వేలకు వేలు పెరుగుతుంటే మాస్కులు అవసరం లేదంటూ వినటం అవ్వాకయ్యారా..? అవును మీరు విన్నది నిజమే. ఈ వార్త తెలంగాణ, ఏపీలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది దక్షిణ కొరియాలోని వాస్తవ పరిస్థితి.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో వేల కేసులు సంఖ్య అమాంతంగా పడిపోతు వందలకు చేరుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలు వైరస్‌ బాధతో ఊపిరి పీల్చుకుంటున్నారు. నేటికి దక్షిణ కొరియాలో 70 పైగా వ్యాక్సినేషన్ జరగటంతో వైరస్ క్షిణిస్తోందని ఆ దేశం ప్రకటించింది. మరో రెండు నెలలు తిరిగేసరికి మాస్కులతో పనేలేదని చెబుతోంది దక్షిణ కొరియా. 60 నుంచి 74 ఏళ్లలోపు వయస్సుల వారికి 60 శాతం వ్యాక్సిన్ అందిందని చెప్పుకొచ్చారు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయుల్ తెలిపారు. దీంతో అక్కడి ప్రజలు ఎగిరిగంతేస్తున్నారు. తాజాగా మంగళవారం నాటికి దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య 707గా నమోదవ్వటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: