ఈటల న్యూ ప్రోఫైల్ ఫోటో…కొత్త పార్టీకి సంకేతమా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌ రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన విషయం మరువకముందే మరో చర్చకు తెరతీశారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో ప్రోఫైల్ పిక్ మార్చడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈటల ప్రోఫైల్ పిక్ మార్చడం వెనుక ఏం జరుగుతుందో మేధావులకు సైతం అంతుచిక్కటం లేదు. ఈయన భూ కబ్జా కేసుల ఆరోపణలు ఎదర్కుంటున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఈటల మీదకు మాటల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలతో పాటు ఆయన రేపోమాపో ఆ పార్టీలో చేరటం ఖాయమన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఇలాంటి వార్తలు వినిపిస్తున్న తరుణమంలోనే ట్విట్టర్‌ ప్రోఫైల్ మార్చడం మరో చర్చకు దారితీస్తుంది.

ఆ పిక్‌లో ఆయన మేడలో నీలిరంగు కండువాతో తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపంతో పాటు కాషాయం రంగుని పులుముకున్న తెలంగాణ మ్యాప్‌ని చూపిస్తూ పూలే, అంబేద్కర్, జయశంకర్ వంటి ప్రముఖుల ఫోటోలతో పిక్‌ను రెడీ చేశారు. దీంతో ఈ పిక్‌లోని అంతరార్థం కొత్త పార్టీ ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తుందన్న ప్రశ్న రాక మానదు. గతంలో పార్టీ పెడుతున్నారన్న వార్తలకు ఈ ప్రోఫైల్‌ పిక్ బలాన్ని చేకుర్చినట్లు అవుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: