కోవిడ్ దెబ్బకు కుదేలైన సినిమా రంగం

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ రాకతో ఏడాదికి పైగా పారిశ్రామిక రంగాలన్నీ దెబ్బతింటున్నాయి, చిన్న, పెద్ద, మధ్యతరగతి రంగాలు నష్టాల బాటన పడ్డాయి. అదే కోవలో చేరిపోయింది సినిమా పరిశ్రమ. ఈ రంగంలో ఎంతోమంది కోవిడ్ భారిన పడటంతో పాటు జీవితాలన్నీ అయోమయంలో కూరుకుపోయాయి. సినిమా రంగాన్ని ఆసరాగా చేసుకుని పనిచేస్తూ మధ్యతరగతి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది లాక్‌డౌన్‌తో ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్ సరైన మార్గమని ప్రభుత్వం మినహాయింపులతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

ఈ దెబ్బతో షూటింగ్‌లన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. గత కొన్ని రోజల క్రితం సినిమాలను సినిమా హాల్‌లో ప్రదర్శించారు. కోలుకున్నామని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ లాక్‌డౌన్‌ అంటూ వారి ఆశలపై నీళ్లు చల్లింది ప్రభుత్వం. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో షూటింగ్‌లు నిలిపివేశారు. ఇప్పటికే విడుదలను వాయిదాలు వేసుకున్న సినిమాలన్నీ ఓటీటీ వేదిక వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతల వరుస లాక్‌డౌన్‌లతో చాలా నష్టాల్లో ఉన్నామని వాపోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: