ఓటీటీలో విడుదలకు రానా సినిమా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడు వినూత్న సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సోంతం చేసుకున్నాడు దగ్గుపాటి రానా. గతంలో ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, అరణ్య వంటి విభిన్న సినిమాలతో తెలుగు తెరకు అభినవ నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు రానా. తాజాగా హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా వేణుఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమాలో నటించాడు రానా. మావోయిస్టు బ్యాక్ డ్రాప్‌లో సరికొత్త ప్రేమ కథను పరిచయం చేస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు యూట్యూబ్‌లో వీక్షికుల మెప్పును పొందుతున్నాయి.

ఇక ఈ సినిమాలో మావోయిస్ఠ్ భారతక్క పాత్రలో మెరవనుంది హీరోయిన్ ప్రియమణి. సరికొత్త విభిన్న కథాంశంతో వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్‌తో మారోసారి వాయిదా పడింది. దీంతో ఓటీటీ వేదికలో విరాట పర్వం విడుదల చేయాలని సినిమా నిర్మాతల భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ఓటీటీలో విడుదల చేస్తారా లేక సినిమా థియేటర్లలో విడుదలకు ఆగుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: