ఆనందయ్య మందుపై గోగినేని సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందుపై ఒకవైపు విమర్శలు మరోపక్క ప్రశంసలు కొనసాగుతున్నాయి. వైద్యులు సైతం కొనియాడుతున్న ఈ మందుపై అనేక కోణాల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. హేతువాదిగా పేరుగాంచి అనేక విషయాల్లో తన భావాన్ని వ్యక్తపరుస్తు సంచలనంగా నిలుస్తున్నారు బిగ్‌బాస్ ఫేమ్ బాబు గోగినేని. అయితే తాజాగా ఆనందయ్య మందుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు గోగినేని.

ఆనందయ్య తయారు చేసిన మందుని చట్నీ అంటూ చెప్పుకొచ్చారు గోగినేని. తను చేసిన వంటకాన్ని మందు అను చెప్పుకోవటం దాన్ని ఎవరూ ప్రశ్నించకపోవటం ఉన్మాదమంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైరస్ సోకిన వ్యక్తి చట్నీ తిని రెండు రోజుల్లోనే నెగిటివ్ అని తేలటం అది దేనికి రుజువు కాదు అని చెప్పారు. ఇక కోవిడ్‌కు ఇది మందు కాదని తమ పరువు పోకుండా ఇమ్మునిటీ బూస్టర్ అంటూ బొంకుతారని ఆయన అన్నారు. ఆనందయ్య మందుపై మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తూ తిన్నది వీరు పరిశోధన చేసుకోండంటూ సలహాలు ఇస్తున్నారు బాబు గోగినేని. ఇక యుద్దం నాటువైద్యం, ఆయూర్వేదం, అల్లోపతి మీద కాదని.. వైరస్‌పై అందరం కలిసి యుద్దం చేయాలని చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: