మరో మెగాహీరోకి జోడిగా కృతి శెట్టి ?

Google+ Pinterest LinkedIn Tumblr +

కృతి శెట్టి.. టాలీవుడ్‌లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ నుంచి తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సుందరి తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మెగాహీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ టాలీవుడ్‌కి ఉప్పెన సినిమాతో పరిచయమయ్యాడు. ఇదే సినిమాలో వైష్ణవ్‌కు జోడిగా నటించింది కృతి శెట్టి.

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రోమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ హిట్‌తో కృతి శెట్టి రేంజ్‌ అమాంతంగ పెరిగి అవకాశాలు వెల్లువల వస్తున్నాయి. మొదటి సినిమాతోనే బంపర్ హిట్‌ కొట్టిన ఈ బ్యూటికి తాజాగా మరో అవకాశం వచ్చనట్లు సమాచారం. మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు టాలెంటెడ్‌ డైరెక్టర్ దేవకట్ట దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతి శెట్టి ఎంపిక కోసం చర్చలు జరుగుతన్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: