కింగ్ సరసన మెరవనున్న రష్మీ?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రొగ్రాం చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. సరైన సమాయానికి అదిరిపోయే పంచ్‌లతో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది ఈ ప్రొగ్రాం. పంచ్‌లతోనే కాకుండా యాంకర్ల రోమాన్స్‌తో సైతం వీక్షకులను కట్టిపడేస్తుంది. అదే కోవాలో చేరిపోయింది యాంకర్ రష్మీ. తన అందంతోనే కాకుండా సుధీర్‌తో లవ్ ట్రాక్‌ నడిపిస్తూ ప్రేక్షకులను కనురెప్పవాల్చనివ్వట్లేదు.

ఇక అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ సినిమాల్లోనూ తన ప్రతిభను చూపిస్తోంది. గతంలో గుంటూరు టాకీస్ అనే చిత్రంలో నటించి తన రోమాన్స్‌తో బంపర్ హిట్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది రష్మీ. ఆ సినిమా తర్వాత ఈ హీరోయిన్‌ రేంజ్ కాస్తంత పెరిగినా తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో మళ్లీ ఢిలా పడి యాంకర్‌గానే నిలదొక్కుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్‌ మన్మధుడు కింగ్ నాగార్జున సరసన రష్మీ గౌతమ్ నటించబోతోందన్న వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. గతంలో ప్రవీణ్‌ సత్తార్ తెరకెక్కించిన గుంటూరు టాకీస్‌లో రష్మీ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దర్శకుడు నాగార్జున హీరోతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాగ్‌కు జోడిగా రష్మీని తీసుకుంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: