40 ఏళ్లకే 44 మంది పిల్లలు… ఇక చాలంటున్న ప్రభుత్వం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇద్దరు పిల్లలను పోషించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆమె ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెను అలాగే వదిలేస్తే అర్థ శతకం చేస్తుందని భావించిన ప్రభుత్వం..ఇక పిల్లలను కనడం ఆపాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు సైతం అప్రమత్తమయ్యారు. ఆమె గర్భాశయాన్ని తొలగించాలని ఆదేశించింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా ? ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియం కు 44 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా ఆమెకు పుట్టిన బిడ్డలే. పిల్లలను కనాలంటే కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. మరి 40 ఏళ్ల వయస్సులో 44 మంది ఎలా కనేసింది..? ఇది ఫేక్ అనుకుంటున్నారా.. అయితే, ఆమెకు ఉన్న సమస్య గురించి తెలుసుకోవల్సిందే.

విషయం ఏంటంటే..

మరియం కు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది. 13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని, భవిష్యత్తు లో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు. చివరికి వైద్యులు చెప్పినట్లే జరిగింది. ఆమె గర్భాశయం లో ఒకేసారి అనేక అండాలు విడుదల కావడం వల్ల ఆమెకు ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున జన్మించారు.

38 మందే మిగిలారు

తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత 5 సార్లు కవలలు జన్మినిచ్చారు. అలా 40 మందికి ఆమె జన్మనిచ్చింది. వీరిలో కొందరు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు. మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేయటంతో 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది. రోజుకు సుమారు 25 కిలోల గోదుమ పిండి ఖర్చవుతుందని ఆమె ఓ వార్త సంస్థకు వెల్లడించింది. వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది. మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని తెలిపింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: