బ్లాక్ ఫంగస్ ఔష‌ధాల ఉత్ప‌త్తికి చర్యలు-కిషన్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర సహాయ మంత్రి కిష‌న్ రెడ్డి నేడు హైద‌రాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఈ ఆస్సత్రిలో బ్లాక్ ఫంగ‌స్ బాధితులకు అందుతున్న చికిత్స‌పై ఆరా తీస్తూ బ్లాక్ ఫంగస్ రోగులను పరామర్శించారు కిషన్ రెడ్డి.

అనంత‌రం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ సోకి కోలుకున్న మ‌ధుమేహ రోగుల్లోనే బ్లాక్‌ఫంగ‌స్ స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని అన్నారు. బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే మందుల కొరత ఉన్న విషయం నిజమేనని, బ్లాక్ ఫంగ‌స్‌కు వాడే మందుల ఉత్ప‌త్తి గురించి 11 సంస్థ‌ల‌ అధినితులతో చ‌ర్చించామ‌ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే కాదు దేశం అన్నిచోట్ల ఈ కొరత ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటామ‌ని అన్నారు. దేశంలోనూ ఔష‌ధాల ఉత్ప‌త్తి పెరిగేలా చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దేశంలోని ప్ర‌తి పౌరుడు కరోనా వారియ‌ర్‌గా న‌డుచుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం 5,690 యాంఫోటెరిసిన్-బీ ఇంజ‌క్ష‌న్ల‌ను పంపించింద‌ని ఆయన వివ‌రించారు. బ్లాక్ ఫంగ‌స్ కేసుల బాధితుల‌కు మెరుగైన‌ వైద్యం అందించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: