నడవలేని పరిస్థితుల్లో రఘురామ..

Google+ Pinterest LinkedIn Tumblr +

రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదు: ఎయిమ్స్‌ వైద్యులు
ఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌ డ్యామేజ్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్‌ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన బుధవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Share.

Comments are closed.

%d bloggers like this: