ఆయనే నా శత్రవు

Google+ Pinterest LinkedIn Tumblr +

రచయిత విజయేంద్రప్రసాద్.. ఈ పేరు చెబితే తెలియానివారుండరనేది కాదనలేని వాస్తవం. ఇండియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌గా కొనసాగుతున్న ఆయన ఎన్నో సినిమాలకు కథలను అందిస్తూ మరెన్నో చిత్రాలను తెరకెక్కించారు. రాజమౌళికి తండ్రిగానే కాకుండా పాన్ ఇండియా రైటర్ గానూ పెరు మూటగట్టుకున్నారు ఈ రైటర్. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది తెలుగు ఖ్యాతిని నలుదిశల చాటారు. తాజగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలీతో సరదాగా ముచ్చటించారు విజయేంద్రప్రసాద్. అయితే అలీ ఓ ప్రశ్న ఇలా అడగగా… మీకు తెలుగు దర్శకుల్లో ఎవరంటే బాగా ఇష్టం?.. టక్కున పూరి జగన్నాధ్ అంటూ సమధానం ఇచ్చారు ఈ పాన్ ఇండియా రైటర్. ఆయనే నా శత్రువని, ఆయనంటే నాకు అసూయ అంటూ పూరిజగన్నాధ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగ పూరిజగన్నాధ్ ఫోటోను తన మొబైల్ స్రీన్ పై పెట్టుకున్న ఫోటోను చూపించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ అలియాభట్ తెరపై కనిపించే సమయం తక్కువై అయినా ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుందని తెలిపారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా చూసానని మూవీ బాగుందంటూ తెలిపారు విజయేంద్రప్రాసద్.

Share.

Comments are closed.

%d bloggers like this: