ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతిని పురస్కరించుకున్నారు హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు ఆర్పించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో తాను కోరుతున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు బాలకృష్ణ. ఈ నిర్ణయం తన ఒక్కడిది కాదని తెలుగు ప్రజలందరిదని ఆయన అన్నారు. దీంతో కరోనా సెకండ్ వేవ్ లో ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలని తెలిపారు బాలకృష్ణ.

Share.

Comments are closed.

%d bloggers like this: