ముందుతరాల మార్గదర్శకుడు ఎన్టీఆర్-చంద్రబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి తారకరామారావు 98వ జయంతిని పురస్కరించుకున్నారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయన నివాళులు ఆర్పించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేంతవరకూ ముందుకెళ్లిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ తారానికే కాకుండా ముందు తరాలకు ఆయన మార్గదర్శకుడంటూ కొనియాడారు చంద్రబాబు.

సామన్యమైన కుటుంబంలో పుట్టి రాజకీయాల్లోనూ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ప్రజల అవసరాలను అంచనా వేస్తూ ఆయన గొప్ప గొప్ప పథకాలను రూపొందించారని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు చంద్రాబాబు. ఎన్టీఆర్ జయంతిని పురుస్కరించుకుని నారా లోకేష్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు నివాళులు ఆర్పించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: