ఆయనతో డేటింగ్‌కు వెళ్తానంటున్న రష్మిక

Google+ Pinterest LinkedIn Tumblr +

రష్మిక మందన్నా… ఇప్పుడు ఈ పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఛలో సినిమాతో అడుగుపెట్టింది ఈ భామ. చాకచక్యంగా సినిమాలను అందుకుంటూ బంపర్ హిట్ లతో దూసుకెళుతోంది ఈ సుందరి. చూడచక్కని అందంతో ఉన్న రష్మిక అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే అగ్రహీరోలతో సైతం ఆడిపాడుతుంది. ఇక అగ్రహీరోయిన్ ల చెంతకు చేరి వారికి సవాల్ విసురుతోంది.

గతంలో విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువల వచ్చి పడ్డాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మూతిన వేలేసుకునేలా చేసింది. ఇంతకు విషయం ఏమిటంటే… నాకు అవకాశం గనుక వస్తే ప్రభాస్ తో డెటింగ్ కు వెళ్తానని మనసులో మాట వెళ్లగక్కింది రష్మిక. నేను ప్రభాస్ కి పెద్ద అభిమానినంటూ తెలిపింది. ఇక బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’ చిత్రంతోపాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే మూవీలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: