ఈటల విషయంలో తొందరెందుకు?-ఇనుగాల పెద్దిరెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఇటల రాజేందర్ ఎపిసోడ్ రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. బహిష్కృత నేతగా ఉన్న ఈటల బీజేపీలో చేరుతున్నారనే వార్తలు తెలుగు రాజకీయాల్లో చర్చనియాంశంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈటల రాకను కొంతమంది తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న వార్తలు కూడా లేకపోలేదు.

ఈ క్రమంలోనే ఆ పార్టీ తెలంగాణ కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలో చేర్చుకునే విషయంలో తొందరెందుకుకంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ అయిన ఆయను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని అన్నారు. బీజేపీ స్థానిక నేతగా ఉన్ననన్ను ఈటల చేరిక విషయంపై ఎందుకు స్పందించటంలేదంటూ తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇక ఈటల మాత్రం రాజకీయంగా కొత్త ఎత్తులు వేస్తు ముందుకు వెళుతున్నారు. ఇన్ని రోజులుగా టీఆర్ఎస్ అగ్రనేతలు మాటలతో విరుచుకుపడుతున్నా.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ తెర వెనకాల మంతనాలు జరుపుతున్నారు. మరి నిజంగానే ఈటల బీజేపీలో చేరుతారా? లేక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనేది అంతుచిక్కని ప్రశ్న.

Share.

Comments are closed.

%d bloggers like this: