జూన్ 7 నుంచి రిజిస్ట్రేషన్‌లకు గ్రీన్ సిగ్నల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు, రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు వంటి వాటికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టింది ప్రభుత్వం. దీంతో మళ్లీ వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లకు అనుమతినిచ్చేందుకు పావులు కదుపుతోందని సమాచారం.

ఇప్పట్లో రిజిస్ట్రేషన్లను అనుమతినించడం ఏమాత్రం మంచిది కాదని ఇది ప్రజలతో పాటు అధికారులకు ప్రమాదమని ఉన్నత స్థాయి అధికారులు నివేదికను ఇచ్చారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మాత్రం పరిమిత స్థాయిలో రిజిస్ట్రేషన్లను అనుమతించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారట. అయితే జూన్‌ 7వ తేదీ దాకా లాక్‌ డౌన్‌ను పొడిగించే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. ఇక కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నా మరో మారు లాక్‌డౌన్‌ పొడిగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: