ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పితృ వియోగం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పితృ వియోగం కలిగింది. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో బాల్క సురేష్ మృతి చెందారు. బాల్క సుమన్ తండ్రి సురేష్ మృతి పట్ల తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాల్క సుమన్ కు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమన్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో పాటు ఆయన ప్రభుత్వ విప్ గా కూడా ఉన్నారు.

ఆయన తండ్రి మృతి పట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ గతంలో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగాను మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు సురేష్.

Share.

Comments are closed.

%d bloggers like this: