బింబిసారగా రాబోతున్న కళ్యాణ్ రామ్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అన్నగా కళ్యాణ రామ్ అందరికి సుపరిచితమే. అయితే ఆయన నటుడిగా నిర్మాతగా దూసుకెళుతున్నాడు. అతనొక్కడు, అసాధ్యుడు, పటాస్ వంటి చిత్రాల ద్వారా ఆయన రేంజ్ అమాంతంగా పెరిగింది. నిర్మాతగాను అనేక సినిమాలు నిర్మించి విజయాలను సైతం అందుకున్నాడు ఈ నందమూరి హీరో.

కాని ఈ సారి భిన్నమైన కథాంశంతో బింబిసార గా సరికొత్త ప్రయోగానికి తెరలేపాడు. స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో భీకరమైన లుక్ తో కనువిందుచేశాడు కళ్యాణ రామ్. శత్రవులను చంపి వారిపై కూర్చోని ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. పోస్టర్ లుక్ లో అదిరిపోయిన కళ్యాణ్ రామ్ చిత్ర టీజర్ లో ఇంకా ఎలా ఉంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: