ఇండియాలో తగ్గుముఖాన కరోనా కేసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో కరోనా విలయతాండవం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతుండంతో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో కేసులు సంఖ్య క్రమంగా దిగివస్తుండటంతో దేశ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఇక తాజాగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో 30,671 మంది కోవిడ్-19 మంది బాధితులు కోలుకోగా సుమారు కొత్తగా 1.74 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు దేశంలో 3617 కరోనాతో మరణించారు. ఇక ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తుండటంతో ఈ మేరకు కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: