నైజీరియాలో పడవ మునిగి 60 మంది మృతి..83 మంది గల్లంతు

Google+ Pinterest LinkedIn Tumblr +

నైజీరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో పయనిస్తున్న పడవ నీటమునిగి ఏకంగా 60 మంది నీటికి బలయ్యారు. మరో 83 మంది గల్లంతైనట్లు సమాచారం. కెబ్బీ రాష్ట్రంలోని వర పట్టణానికి దగ్గరలోని నైజర్ నదిలో ఈ దుర్ఘటన జరిగింది. పడవ ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వస్తువును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రాథమిక నిర్ధారణలో ఈ ప్రమాదానికి సంభందించి కొన్ని విషయాలు తెలిపారు అధికారులు. సమర్ధ్యానికి మించి పడవలో ప్రయాణించటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు అధికారులు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

Share.

Comments are closed.

%d bloggers like this: