హనుమాన్ అంటూ సరికొత్త చిత్రంతో ప్రశాంత్ వర్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న సినిమాలతో తన సత్తాను చాటారు డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. తీసిన మూడు చిత్రాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు ప్రశాంత్. అయితే తాజాగా తన నాల్గో ప్రాజెక్ట్‌ సంభందించిన ఓ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఇక విషయానికొస్తే హానుమాన్ అంటూ సరికొత్త టైటిల్‌తో మనముందుకొచ్చాడు ఈ యువ దర్శకుడు.

ఈ సారి ఇండియన్ రియల్ సూపర్ హీరో మీద సినిమా తీసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా టైటిల్‌కు వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఇక నేడు ప్రశాంత వర్మ పుట్టిన రోజు కావడటంతో ఈ టైటిల్ పోస్టర్‌ను వదిలాడు ఈ డైరెక్టర్. హీరో, హీరోయిన్‌ల విషయాల జోలికి పోకుండా టైటిల్‌ను మాత్రమే రిలిజీ చేశారు. ఇక ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: