విమాన ఛార్జీల పెంపు..జూన్ 1 నుంచి అమల్లోకి

Google+ Pinterest LinkedIn Tumblr +

విమాన ధరలు పెంచుతూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ విమాన ప్రయాణ ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రయాణానికి వెనకంజ వేస్తున్నారు. దీంతో విమానయాన సంస్థకు నష్టాలు దరి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విమానయాన మంత్రిత్వ శాఖ ఇలాంటి నిర్ణయాలకు అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ రంగపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ కూడా భారీగా పడటంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. పెరిగిన ఈ ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: