వ్యాక్సిన్ తీసుకో..నగదు గెలుచుకో

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వైరస్ కేసులు సంఖ్య పైపైకి పాకుతున్న తరుణంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ అంటూ వచ్చిన వ్యాక్సిన్ ప్రజలకు కాస్త ఉపషమనం కలిగించింది. దీంతో రాష్ట్రాలు అధికారికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇక చాలామంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెనకంజ వేస్తున్నారు కారణం. సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయంటూ భయందోళనలకు గురవుతున్నారు.

ప్రభుత్వాలు మాత్రం ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం చేస్తోంది. ఇక ఇదంత బాగానే ఉన్నా.. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రైజ్ మనీ ఇస్తామంటూ కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి. అవును.. మీరు విన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వ్యాక్సిన్ వేసుకున్న వారికి నగదు ప్రోత్సాహకం ఇస్తామంటూ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి 116 మిలియన్‌ల డాలర్లు (సుమారు రూ. 840 కోట్ల) నగదు ఇవ్వనున్నారు. ఈ లక్కీ డ్రా జూన్ 4 నుంచి ప్రారంభంకాబోతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: