ఆయన దేవుడిచ్చిన వరమంటున్న కేఏపాల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఆనందయ్య మందుపై స్పందించాడు. ఆనందయ్య మందు ఇవ్వటం ఆయనను మనకు దేవుడిచ్చిన వరమంటూ కొనియాడారు. ఓ వీడియోలో మాట్లాడిన ఆయన ఇలాంటి సూచనలు చేశారు. ప్రకృతి వనమూలికలతో తయారు చేస్తున్న ఆయన మందును ప్రజలకు అందించటం చాలా మంచిదని అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌ లేకుండా సహజ సిద్ధంగా తయారు చేస్తున్న ఆయనను మనం కాపాడుకోవాలన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయివేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా దోచుకుని ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఈ ప్రయివేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే తన తల్లిని కాపాడుకోలేకపోయానన్నారు. జాతీయ మీడియా సంస్థలు ఆనందయ్య వద్దకు చేరుకుని విచారణ జరపాలని సూచించారు. ఆనందయ్యతో చేతులు కలిపి తయారికి కావాల్సిన శిక్షణ ఉచితంగా ఇస్తామన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: