దేవుడు ప్రత్యక్షమైతే ఆ కోరికను అడగాలనుంది

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో అగ్రహీరోలతో నటించి బంపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. దీంతో ఈ అమ్మడుకు బాలీవుడ్ లో ఆఫర్లు రావటంతో అక్కడికి చెక్కేసింది.

ఇక తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ బాట పడుతున్నపూజా ప్రస్తుతం రణవీర్ సింగ్ తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇక రణవీర్ లోని మంచి విషయాలను నేర్చుకుంటున్నానని తెలిపింది ఆమే. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే రణవీర్ లోని శక్తిని, హాస్యాన్ని అప్పుగా ఇవ్వమని అడుగుతానని తెలిపింది పూజా.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: