వీల్ చైయిర్ పై రఘురామ..కేంద్రమంత్రితో భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం ఎంపీ రఘురామరాజు వీల్ చైయిర్ పై దర్శనమిస్తు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తనపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. దాదాపు 10 నిమిషాలకు పైగా రాజ్ నాథ్ తో సమావేశం అయినట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తనపై లేనిపోని ఆరోపణలు లేవనెత్తుతోందంటూ ఫిర్యాదు చేశారు.

తాజాగా బెయిల్ పై విడుదలైన ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఏపీ సీఐడీ అధికారులు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే నేపంతో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీల్ చైయిర్ పై కనిపిస్తూ 10 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో ఇంకా ఏం చర్చించారనేది చర్చనీయాంశంగా మారింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: