మళ్లీ నిలిపేసిన చేప ప్రసాదం పంపిణీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతీ ఏడాది నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఈ సారి కూడా వాయిదా పడింది. కరోనా వైరస్ కారణంగా దీనిని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్. మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా పంపిణీ చేయాలని భావించినా కోవిడ్ కారణంగా వాయిదా పడటం కాస్త నిరాశే అని చెప్పాలి. చేప ప్రసాదం పంపిణీ కోసం కొన్ని వేల మంది ఎదురుచూస్తారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నిలివేస్తున్నట్లు తెలిపారు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్. మా బంధువులతో పాటు కటుంబ సభ్యులందరం ఈ ప్రసాదం తీసుకుంటామని తెలిపారు. కరోనా కారణంగా గతేడాది కూడా చేప ప్రసాదం నిలిపివేశారు. ఇక రాష్ట్రంలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: