దక్షిణ మధ్య రైల్వే మరో నిర్ణయం

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎవరూ కూడా రైళ్లల్లో ప్రయాణానికి ముందడుగు వేయటం లేదు. ఇలాంటి నిర్ణయాలను అంచనా వేసినా దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రయాణాలను అందరూ వాయిదా వేసుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.

ఇందులో 24 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో నాలుగింటిని పాక్షికంగా వివిధ స్టేషన్ల మధ్య రద్దు చేసింది. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే ఉండేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గుతు వస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: