మళ్లీ రంగంలోకి శశికళ?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నశశికళ మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు ఓ స్థాయిలో ఊపందుకుంటున్నాయి. తమిళనాడులో జయలలితతో కలిసి అడుగులు వేసిన శశికళ రాజకీయాల్లో మెలుకువలు చేర్చుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇక అన్నాడీఎంకే పార్టీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య రాజకీయ పోరు నువ్వా నేనా అన్నట్లు తయారైంది. దీంతో శశికళ ఎంట్రీ ఇవ్వటంతో ఆ పార్టీ మళ్లీ దారిలో ఉండనుందని పార్టీ నేతలు చేవులు కొరుక్కుంటున్నారట. అయితే కొన్ని రోజుల క్రితం శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ తన అభిమానులు ప్లెక్సీలతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఓ అన్నాడీఎంకే అగ్రనేతతో పార్టీలోకి నేను వస్తున్నానంటూ..పార్టీని మళ్లీ సెట్ చేద్దామంటూ ఓ ఆడియో వైరల్ కావటంతో శశికళ మళ్లీ వస్తున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేరూర్చినట్లు అవుతోంది. మరి ఇంతకు నిజంగానే శశికళ రాజకీయాల్లోకి వస్తున్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో.

 

Share.

Comments are closed.

%d bloggers like this: