ఢిల్లీకి ఈటల..బీజేపీ అగ్రనేతలతో భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. గత కొన్నిరోజులుగా ఆయన కాషాయ గూటికి చేరుకుంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారనే వార్తలకు ఢిల్లీ పయనం బలం చేకూర్చినట్లు అవుతోంది.

ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వంటి బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరి సమక్షంలోనే ఆయన పార్టీలోకి జాయిన్ అవుతున్నారని వార్తలు సైతం ఊపందుకున్నాయి. ఏదీ ఏమైనా ఈటల రాజకీయ కదలికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇక మొత్తానికి ఈటల రేపటి భేటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: