దైర్యం కోల్పోకండి..నేనున్నా-వైఎస్ షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజన్న బిడ్డనంటూ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల. తాజాగా తెలంగాణలో సమకాలీన పరిస్థితులపై స్పందిస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు వివిధ రంగాల ప్రముఖులు కరోనా మహమ్మారితో బాధపడుతున్న వారికి తమకు తోచిన సహాయాన్ని అందిస్తుున్నారు. తాజాగా అదే దారిలోకి వచ్చారు షర్మిల.

కరోనాతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలకు ఆర్థికంగా సహాయం అందిస్తానని షర్మిల ట్విటర్‌లో తెలిపారు. ‘‘తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి. క‌రోనాతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన మ‌హిళ‌ల‌ను అండ‌గా ఉంటా. వారి బాధలో పాలుపంచుకోవటానికి ఆర్థికంగా నా వంతుగా సహాయం అందిస్తా. స‌మాచారం అందించాల్సిన నంబ‌ర్ 040-48213268’’ అంటూ ట్వీట్‌ చేశారు షర్మిల.

Share.

Comments are closed.

%d bloggers like this: