ముగ్గురు పిల్లల సంతానానికి చైనా గ్రీన్‌సిగ్నల్

Google+ Pinterest LinkedIn Tumblr +

జనాభా పెరిగిపోతుందని ప్రపంచంలోని కొన్ని దేశాలు తలలు బాదుకుంటుంటే చైనా మాత్రం ముగ్గురి పిల్లల వరకూ కనండని చెబుతోంది. ఇదే విషయంపై తాజాగా ఓ ప్రకటన చేసింది చైనా ప్రభుత్వం. దంపతులిద్దరూ ముగ్గురు పిల్లలకి జన్మనివ్వటానికి అధికారికంగా తెలిపింది జింగ్‌పింగ్‌ సర్కార్.

ఇక ప్రధాని అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఇద్దరు పిల్లలు కనేందుకు 2016లోనే అనుమతి ఇచ్చినా.. పెద్దగా ప్రయోజనం మాత్రం రాలేదు. దీంతో యాబై ఏళ్లపాటు జనాభా నియంత్రణకు అలవాటు పడ్డ చైనీయులు ఈ వార్తతో ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా కల్గిన దేశాల్లో చైనా పట్టికలో ముందే ఉండటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: