గొప్ప మనసుని చాటుకున్న వెంకటగిరి ముద్దుబిడ్డ

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా వేళ చాలా మంది ప్రముఖులు తమ మంచి మనసుని చాటుకుంటున్నారు. తాజాగా అదే పని చేశారు వెంకటగిరి ముద్దుబిడ్డ కోనా డాక్టర్ వంశీకృష్ణ. కర్నాటకలోని తుంకూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 4 లక్షల విలువచేసే 3 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లనుల రూ. 1 లక్ష విలువచేసే కోవిడ్ రక్షణ సామగ్రిని వితరణగా అందజేశాడు కోనా వంశీకృష్ణ. ఈ సామాగ్రిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్, జీకే పల్లి, బంగారుపేట, డక్కిలి రాపూరు, బాలాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలకు, వెంకటగిరిలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, శ్రీ చక్ర హాస్పిటల్ కోవిడ్ సెంటర్లకు వితరణగా అందజేశారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: